Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టు కీలక తీర్పు

High Court supports ACB Courts verdict in MLAs poaching case
షార్ట్స్‌లో చూడండి
నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఎర వేశారనే కేసులో తెలంగాణ సిట్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ వేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గుర్నీ నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్ లకు మెమో ఇచ్చింది. 

అయితే ఈ ముగ్గురినీ నిందితులుగా చేర్చడాన్ని ఏసీబీ కోర్టు తోసిపుచ్చుతూ, మెమోను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును సిట్ ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సమర్థించింది. సిట్ అప్పీలును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.
Go Back to Shorts
Telangana
MLAs
Poaching

More Telugu News