మరోసారి జంటగా కనిపించిన మంచు మనోజ్, భూమా మౌనిక.. పెళ్లి డేట్ ఫిక్స్!
- శోభా నాగిరెడ్డి జయంతి కార్యక్రమాలలో పాల్గొన్న మనోజ్
- త్వరలో కొత్త జీవితం ప్రారంభిస్తానని ప్రకటించిన మనోజ్
- ఫిబ్రవరి రెండో వారంలో మనోజ్–మౌనిక పెళ్లి చేసుకుంటారని వార్తలు!
అదే సమయంలో త్వరలోనే కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నానని చెప్పాడు. దాంతో, మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడన్న అభిప్రాయాలు మొదలయ్యాయి. రెండో వారంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. మనోజ్ గతంలో ప్రణతిరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటిరిగా ఉన్న మనోజ్.. తన చిన్ననాటి స్నేహితురాలైన భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇప్పటిదాకా ఇద్దరూ స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు.