విడుదలకు ముందే లీక్​ అయిన అవతార్2.. మొత్తం చిత్రం ఆన్​ లైన్​లోకి!

  • టెలీగ్రామ్, టోరెంట్స్ లో లింక్స్ ప్రత్యక్షం
  • డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా చూస్తున్న ప్రేక్షకులు
  • రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం
Avatar 2 Full Movie Leaked Online For Free Download

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్’ హాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కి అన్ని భాషల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనికి కొనసాగింపు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇన్నేళ్లకు ‘అవతార్ 2’ వస్తోంది. ‘ద వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లిష్ తో పాటు పలు భారతీయ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఏకంగా 160 భాషల్లో రిలీజ్ అవుతోంది. 

భారత్ లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. అయితే, ఈ చిత్రం మరొక రోజులో థియేటర్లలో సందడి చేయనుందనగా.. చిత్రబృందానికి పైరసీదారులు షాకిచ్చారు. గురువారమే ఈ చిత్రాన్ని లీక్ చేశారు. మొత్తం చిత్రాన్ని ఆన్ లైన్ లో పెట్టారు. లండన్ లో ఈ నెల 6వ తేదీనే విడుదల కావడంతో ఈ చిత్రం కాపీని టెలీగ్రామ్ తో పాటు టోరెంట్ సైట్లలో అందుబాటులో ఉంచారు. దాంతో, పలువురు దీన్ని డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా చూస్తున్నారు. చిత్రం లింక్స్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తున్నారు.

More Telugu News