'శబరి' డబ్బింగ్ మొదలెట్టేసిన వరలక్ష్మి శరత్ కుమార్!

Sabari Movie Update
  • తెలుగు .. తమిళ భాషల్లో వరలక్ష్మి శరత్ కుమార్ కి డిమాండ్ 
  • ఆమె ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'శబరి'
  • సంగీత దర్శకత్వం వహించిన గోపీసుందర్ 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
వరలక్ష్మి శరత్ కుమార్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. ముఖ్యమైన ... కీలకమైన పాత్రలతో పాటు తాను ప్రధానమైన పాత్రగా ఆమె 'శబరి' సినిమా చేసింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. రొమాంటిక్ టచ్ ఉన్న థ్రిల్లర్ మూవీ ఇది. 

మహేంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగు కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాన్ని జరుపుకుంటోంది. తాను పోషించిన పాత్రకి వరలక్షి శరత్ కుమార్ డబ్బింగ్ చెబుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలను టీమ్ రిలీజ్ చేసింది. 

తెలుగు .. తమిళ భాషల్లో వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఈ సినిమాను ఈ రెండు భాషల్లోను రిలీజ్ చేయనున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, గణేశ్ వెంకట్రామన్ .. మైమ్ గోపీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Varalakshmi Sharath Kumar
Ganesh Venkatraman
Mime Gopi

More Telugu News