రైలు డోర్ వద్ద కూర్చొని ప్రయాణించిన సోను సూద్.. రైల్వే పోలీసుల రియాక్షన్!

Sonu Sood sits by door of moving train
  • కదులుతున్న ట్రైన్ లో ఫుట్ బోర్డ్ వద్ద ప్రయాణం
  • ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేయవద్దన్న నెటిజెన్లు
  • నిజ జీవితంలో ఇలాంటివి వద్దన్న రైల్వే పోలీసులు
ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదులుతున్న ట్రైన్ లో డోర్ వద్ద కూర్చున్న వీడియో అది. ఈ వీడియోపై కొందరు నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేయడం సరికాదని చెపుతున్నారు. ఎంతో మందికి స్పూర్తిదాతగా ఉన్న మీరు ఇలా చేయవద్దని కోరుతున్నారు. మరికొందరు సోనుపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ముంబై రైల్వే పోలీసులు కూడా స్పందించారు. 'సోనూ సూద్ ఫుట్ బోర్డ్ మీద ప్రయాణించడం సినిమాల్లో అయితే ఎంటర్టైన్ మెంట్ గా ఉంటుంది. నిజ జీవితంలో కాదు' అని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Sonu Sood
Moving Train
Door

More Telugu News