తన భార్య ప్రియుడి సెల్‌ఫోన్ సమాచారాన్ని పరిశీలించాలన్న భర్త.. కుదరదన్న హైకోర్టు
- విడాకుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు
- తన భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న భర్త
- విడాకుల కేసులో మూడో వ్యక్తి గోప్యతకు భంగం కలిగించలేమన్న హైకోర్టు
కేసు విచారణ సందర్భంగా.. తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అతడి సెల్‌ఫోన్ సమాచారాన్ని పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుందని ఆమె భర్త వాదించాడు. దీంతో అతడి భార్య ప్రియుడిగా చెబుతున్న వ్యక్తి హైకోర్టుకెక్కాడు. తన ఫోన్ కాల్స్ వివరాలను కోరడాన్ని సవాలు చేశాడు. వాదనలు విన్న న్యాయస్థానం.. భార్యాభర్తల విడాకుల కేసులో మూడో వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇది ఆ వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన గోప్యతా హక్కుకు భంగం కలిగించడమే అవుతుందని హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం. నాగప్రసన్న తేల్చి చెప్పారు.