India: చైనా సైనికులను భారత జవాన్లు ఇలా తరిమికొట్టారు.... వీడియో ఇదిగో!

Sonu Sood shares a video of Indian soldiers courage against China Forces in border face off
  • వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు
  • భారత భూభాగంలోకి అడుగుపెట్టిన చైనా సైనికులు
  • అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్లో ఘర్షణ
  • వీడియో పంచుకున్న సోనూ సూద్
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం తెలిసిందే. భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికులను భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేశారు. 

కాగా, ఈ సరిహద్దు ఘర్షణలకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు సోనూ సూద్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఓ సమూహంలా వచ్చిన చైనా సైనికులను భారత జవాన్లు వీరోచితంగా ఎదుర్కొని వారిని లాఠీలతో తరిమికొడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. గతంలో మాదిరే చైనా సైనికులు ఈసారి కూడా మేకులు అమర్చిన రాడ్లు, తదితర ఆయుధాలతో భారత్ బలగాలను ఎదుర్కొనేందుకు వచ్చినట్టు తెలుస్తోంది.
India
China
Border
Tawang
Arunachal Pradesh
Sonu Sood
Video

More Telugu News