500 విమానాలు కొనుగోలు చేయనున్న ఎయిరిండియా!

Air India reportedly set to purchase 500 planes
  • ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్
  • ఎయిరిండియాను మరింత విస్తరించేందుకు నిర్ణయం
  • రూ.80 వేల కోట్లతో కొత్త విమానాల కొనుగోలు
టాటాల పరమైన విమాన సర్వీసుల దిగ్గజం ఎయిరిండియా భారీ సంఖ్యలో విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. తన సేవలను మరింత విస్తృతం చేసే కార్యాచరణలో భాగంగా సుమారు 500 జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా భావిస్తోంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేయనుంది. అందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. 

కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలు తక్కువ సీటింగ్ కలిగిన విమానాలు కాగా, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్ బస్ కు చెందిన ఏ350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విమానయాన రంగం వర్గాలు తెలిపాయి. దీనిపై ఎయిరిండియా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Advertisement
Air India
Planes
TATA
AirBus
Boeing

More Telugu News