అందరూ అనుకునేది ఇది .. అసలు జరిగిందేంటంటే: 'ముఖచిత్రం' ట్రైలర్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందరూ అనుకునేది ఇది .. అసలు జరిగిందేంటంటే: 'ముఖచిత్రం' ట్రైలర్ రిలీజ్!

Mukha Chitram Movie Trailer Released
  • విభిన్నమైన కథాంశాన్ని కలిగిన 'ముఖ చిత్రం'
  • కీలకమైన పాత్రను పోషించిన విష్వక్సేన్
  • సంగీత దర్శకత్వం వహించిన కాలభైరవ 
  • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల
ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు స్టార్ డమ్ గురించి కాకుండా, కంటెంట్ గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. కంటెంట్ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే చాలు, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతున్నాయి. అలాంటి చిన్న సినిమాల జాబితాలో వస్తున్న మరో మూవీనే 'ముఖ చిత్రం'. 

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది. 'అందరూ అనుకుంటున్నా కథ ఇది .. అసలు జరిగింది ఇది'.. అంటూ కథలో అసలు పాయింటును చెబుతూ ఈ ట్రైలర్ ను వదిలారు. 

వికాస్ వశిష్ఠ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో, కథానాయికగా ప్రియ వడ్లమాని కనిపించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలను విష్వక్సేన్ .. చైతన్య రావు .. రవిశంకర్ పోషించారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement
Vikas
Priya
Vishwak Sen
Mukha Chitram Movie

More Telugu News