'లవ్ టుడే' అందాలరాశి .. ఇవాన లేటెస్ట్ పిక్స్!

26-11-2022 Sat 11:16 | Entertainment
  • తెలుగులో నిన్ననే విడుదలైన 'లవ్ టుడే'
  • గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసిన ఇవాన
  • వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నట్టుగా వినికిడి 
  • టాలీవుడ్ లోను బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువే 
  • ఆకట్టుకుంటున్న లేటెస్ట్ పిక్స్ 
Ivana Special
ఇప్పుడు కుర్రాళ్లంతా 'ఇవనా' గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఈ ఇవనా అంటే 'లవ్ టుడే' హీరోయిన్. ఈ సినిమా తమిళంలో హిట్ అయిందనీ .. చాలా ఫాస్టుగా 50 కోట్ల మార్కును టచ్ చేసిందని దిల్ రాజు చెప్పడంతో, నిన్న ఓపెనింగ్స్ బాగానే కనిపించాయి. సినిమాకి వెళ్లిన తరువాత కథాకథనాల సంగతి ఎలా ఉన్నా, హీరోయిన్ మాత్రం కుర్రాళ్లను కట్టిపడేసింది. విశాలమైన కళ్లతో ఆమె చేసిన హావభావ విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటిదాకా ఈ బ్యూటీ ఏమైపోయింది? ఎక్కడి నుంచి ఇలా ఊహల్లో ఊడిపడింది అనుకుంటూ కుర్రాళ్లు ఆమెను గురించి సెర్చ్ చేశారు. కొంతకాలం క్రితమే మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కేరళ బ్యూటీ, ఆ తరువాత తమిళ యూత్ హృదయాలను టచ్ చేసింది. 'లవ్ టుడే' సినిమాలో ఆమెకి తగిన పాత్ర పడటంతో తన సత్తా ఏమిటనేది చూపించింది. ఈ సినిమా తరువాత తమిళంలో ఆమెకి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయని టాక్. ఇక టాలీవుడ్ మేకర్స్ కూడా ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం తెలుగు తెరపై కుదురుకుంటున్న కుర్ర హీరోయిన్లకు ఇవాన గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సుందరి లేటెస్ట్ పిక్స్ చూస్తే, మరికొంతమంది కుర్రాళ్లు ఆమె అభిమానుల జాబితాలో జాయిన్ కావడం ఖాయంగా అనిపిస్తోంది.