'ధమ్కీ' రిలీజ్ డేట్ ఖరారు!

24-11-2022 Thu 12:00
  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'ధమ్కీ'
  • కథానాయికగా నివేదా పేతురాజ్ 
  • సంగీతాన్ని అందించిన లియోన్ జేమ్స్ 
  • రీసెంటుగా వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్
  • వివిధ భాషల్లో ఫిబ్రవరి 17న సినిమా రిలీజ్ 
Dhamki Movie Release Date Confirmed
విష్వక్సేన్ హీరోగా 'ధమ్కీ' సినిమా రూపొందుతోంది. సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఆయనే దర్శకుడు. ఇటీవలే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక శ్రీమంతుడికి ఎదురైన సమస్యను, ఒక సాధారణమైన వెయిటర్ ఎలా పరిష్కరించాడనేదే కథ. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. విష్వక్ యాక్షన్ లోకి దిగిపోయినట్టుగానే ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ కామెడీ జోనర్లో నడిచే సినిమా ఇది. 

ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా నివేదా పేతురాజ్ అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. రోహిణి .. అజయ్ కనిపించనున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించిన ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో విష్వక్ హిట్ కొడతాడేమో చూడాలి.