టీనేజ్ లవ్ స్టోరీగా 'బేబీ' .. టీజర్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీనేజ్ లవ్ స్టోరీగా 'బేబీ' .. టీజర్ రిలీజ్!

Baby Movie Teaser Released
  • మరో ప్రేమకథగా రూపొందిన 'బేబీ'
  •  గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
  • ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న మూవీ  
  • కథానాయికగా వైష్ణవి పరిచయం
ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య జంటగా 'బేబీ' సినిమా రూపొందింది. శ్రీనివాస కుమార్ నిర్మించిన ఈ సినిమాకి సాయిరాజేశ్ దర్శకత్వం వహించాడు. గతంలో సాయిరాజేశ్ నిర్మాతగా 'హృదయ కాలేయం' .. 'కొబ్బరి మట్ట' .. 'కలర్ ఫొటో' సినిమాలను నిర్మించాడు. దీనిని బట్టి ఆయన అభిరుచి ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. 

ఈ సారి సాయి రాజేశ్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుని 'బేబీ' సినిమాను రూపొందించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. ఈ స్టేజ్ పై మారుతి .. హరీశ్ శంకర్ .. అనిల్ రావిపూడి .. వశిష్ఠ సమక్షంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇది గ్రామీణ నేపథ్యంలో హై స్కూల్ స్థాయిలో జరిగే ప్రేమకథ అనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. హీరో హీరోయిన్ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు కావడం .. ప్రేమలో పడటం .. ప్రేమలోని అనుభూతిని పొందడం ఈ టీజర్ లో చూపించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Anand Devarakonda
Vaishnavi
Sai Rajesh
Baby Movie

More Telugu News