పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల.. సభ ఎప్పటి నుంచి అంటే!
- డిసెంబర్ 7 నుంచి 29 వరకు ఉభయ సభల సమావేశాలు
- మొత్తం 17 పని దినాలు ఉంటాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
- ఈ నెల 21 నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలు
కాగా, పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ఈ నెల 21వ తేదీన ప్రీ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీకి సూచనలు కోరుతూ మంత్రి సమావేశాలు నిర్వహించనున్నారు. పరిశ్రమల చాంబర్లు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగం నిపుణులతో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం అవుతారు.