తీహార్ జైల్లో ఆప్ మంత్రికి మసాజ్.. గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీ చేతికి అస్త్రం
- ఈడీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సత్యేంద్ర
- ఓ వ్యక్తి ఆయన పాదాలకు మసాజ్ చేస్తున్న వీడియో వైరల్
- జైల్లో ఉన్న వ్యక్తికి వీఐపీ ట్రీట్ మెంట్ అంటూ ఆప్ పై బీజేపీ దాడి
బీజేపీ బయటపెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో, జైలులో ఉన్న వ్యక్తికి ఆప్ రాచమర్యాదలు చేయిస్తోందని బీజేపీ విమర్శలు గుప్తిస్తోంది. తీహార్ జైలులో సత్యేంద్ర జైన్ రాజభోగాన్ని అనుభవిస్తున్నారంటూ ఇదివరకే బీజేపీ నాయకులు పలుమార్లు ఆరోపించారు. తాజా వీడియోతో వారి చేతికి ఓ అస్త్రం చిక్కినట్టయింది. కేజ్రీవాల్ ప్రభుత్వమే దగ్గరుండి ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తోందంటూ మండిపడుతున్నారు. వీడియోపై స్పందించిన జైలు అధికారులు.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు.