యూపీ జైలులో 140 మంది హెచ్ఐవీ రోగులు
- 2016 నుంచి జైలులోనే హెచ్ఐవీ బాధిత ఖైదీలు
- ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న అధికారులు
- ఖైదీలతో కిక్కిరిసిన దస్నా జైలు
హెచ్ఐవీ బాధితులకు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు దస్నా జైలు అధికారులు తెలిపారు. దస్నా జైలు ఖైదీలతో కిక్కిరిసి పోయిందని అధికారులు చెప్పారు. జైలులో 1706 ఖైదీలను ఉంచేందుకు మాత్రమే సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం 5500 మంది ఖైదీలు ఉన్నారని పేర్కొన్నారు. కాగా, రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేసే ఈ వైరస్ సోకినవాళ్లు సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. హెచ్ఐవీ ముదిరి ఎయిడ్స్ గా మారుతుందని, దీనికి పూర్తిస్థాయిలో చికిత్స లేదని తెలిపారు.