కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విచారణకు హాజరైన ఏపీ ఐఏఎస్ లు
- ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల అంశంలో కోర్టు ధిక్కరణ కేసు
- కోర్టుకు వచ్చిన నలుగురు ఐఏఎస్ లు
- పిటిషనర్లకు వ్యయం పెరుగుతోందన్న హైకోర్టు
- ఎందుకు ఏడాది జాప్యం చేశారని ప్రశ్నించిన ధర్మాసనం
ఏడాది క్రితం బిల్లుల చెల్లింపు ఆదేశాలను పట్టించుకోలేదంటూ వీరిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. నేటి విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ హైకోర్టు ధర్మాసనం ఐఏఎస్ అధికారులను ప్రశ్నించింది. పిటిషనర్లకు వ్యయం పెరుగుతోందని వెల్లడించింది.
కాగా, ఇవాళ విచారణ ఉందని తెలిసి, బిల్లుల చెల్లింపులను రెండ్రోజుల కిందట ఖాతాలో వేశారని హైకోర్టు ఆక్షేపించింది. ఏడాది జాప్యంపై సరైన వివరణ ఇవ్వాలని నలుగురు అధికారులను ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.