మట్టి గుట్ట ఎక్కి రిషికొండ పనులను పరిశీలించిన పవన్ కల్యాణ్
- రెండు రోజులుగా విశాఖలోనే పవన్ కల్యాణ్
- నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జనసేనాని
- నేడు రిషికొండ పరిశీలనకు వెళ్లిన వైనం
ఈ సందర్భంగా వైసీపీ నేతలు యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపిస్తున్న రిషికొండను పరిశీలించేందుకు పవన్ వెళ్లారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని రిషికొండ చేరుకున్న పవన్ కల్యాణ్... కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా...వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారీకేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను ఎక్కి... బారీకేడ్ల ఆవలి వైపు ఏం జరుగుతోందన్న దానిని పరిశీలించారు.