రేపు మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

All set for Munugode votes counting
  • నవంబరు 3న మునుగోడులో పోలింగ్
  • నవంబరు 6న ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
  • మధ్యాహ్నం వేళకు విజేతపై స్పష్టత వచ్చే అవకాశం
ఈ నెల 3న మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు (నవంబరు 6) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

ఓట్ల లెక్కింపునకు నల్గొండలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ వేదికగా నిలవనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం సమయానికి విజేత ఎవరన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

కాగా, మునుగోడు ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. నేడు డమ్మీ ఈవీఎంలతో మాక్ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేశారు.
Go Back to Shorts
Munugode
Bypolls
Counting
BJP
TRS
Congress
Telangana

More Telugu News