దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు... మరోసారి 60 వేలు దాటిన సెన్సెక్స్
- అంతర్జాతీయ సానుకూలతలతో జోరుమీదున్న మార్కెట్లు
- 60,547 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్
- 17,951కి చేరుకున్న నిఫ్టీ
ఆటోమోబైల్స్, ఐటీ, టెక్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ తదితర సూచీలు భారీ లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, మారుతి కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.