నానీగారిని చూస్తూనే నటన నేర్చుకున్నాను: సంతోష్ శోభన్
- సంతోష్ శోభన్ నుంచి మరో సినిమా
- రొమాంటిక్ కామెడీ జోనర్లో సాగే కథ
- నాని ముఖ్య అతిథిగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- వచ్చేనెల 4వ తేదీన సినిమా విడుదల
'చాలామందికి తెలియదు ... నా ఫస్టు సినిమాను ఫస్టు చూసింది నానీగారే. అలాగే సినిమాలకి సంబంధించి నాకు ఫస్టు అడ్వైజ్ ఇచ్చింది .. ఫస్టు కాంప్లిమెంట్ ఇచ్చింది కూడా నానీగారే. తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో ఎలా ఉన్నారో .. నేను అలా ఉన్నానని ఆయనే స్వయంగా చెప్పడం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నానీగారిలా చేస్తానని చాలామంది అంటూ ఉంటారు. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే మాట" అంటూ హర్షాన్ని వ్యక్తం చేశాడు.
"నిజంగానే నేను నానీగారి నుంచే నేర్చుకుంటూ వచ్చాను. అందుకే ఆడియన్స్ కి అలా అనిపిస్తూ ఉంటుంది. 'భలే భలే మగాడివోయ్' సినిమాను ఎనిసార్లు చూశానో .. ఆ డైలాగులను ఎంతగా ప్రాక్టీస్ చేశానో ఎవరికీ తెలియదు. అలాంటి నానీగారు నా సినిమా ఫంక్షన్ కి రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.