అమరావతి రైతుల యాత్రపై ఏపీ హైకోర్టులో విచారణ పూర్తి... తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
- అమరావతి రైతుల యాత్రను నిలిపివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం
- అదనపు భద్రతతో కొనసాగించాలన్న అమరావతి రైతులు
- అన్ని పిటిషన్లపై ఉమ్మడి విచారణ చేపట్టిన హైకోర్టు
- పలు కొత్త అంశాలను ప్రస్తావించిన అమరావతి రైతులు
విచారణ సందర్భంగా అమరావతి రైతులు గతంలో కోర్టుకు తెలిపిన విషయాలతో పాటు మరికొన్ని అంశాలను తాజాగా విచారణలో ప్రస్తావించారు. యాత్రకు మద్దతుగా ఆయా ప్రాంతాలకు చెందిన వారు వస్తూ ఉంటారని, వారిని కూడా యాత్రలో పాల్గొన్న వారిగా పోలీసులు పరిగణిస్తున్నారని ఫిర్యాదు చేశారు. యాత్రకు మద్దతు తెలుపుతున్న వారు యాత్రకు ముందూ వెనుకా నడిచేలా అనుమతి ఇవ్వాలని కోరారు. యాత్రలో కోర్టు చెప్పినట్లుగా 600 మంది మాత్రమే పాల్గొంటామని...ఎవరైనా తొలగితే వారి స్థానంలో కొత్త వారు వచ్చేలా అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక యాత్ర ద్వారా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని యాత్రను నిలుపుదల చేయాలని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనలన్నీ విన్న కోర్టు... విచారణ ముగిసినట్లు ప్రకటించింది. తీర్పును తర్వాత వెల్లడించనున్నట్లు ప్రకటించింది.