31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ... ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరు
- ఇదివరకే మునుగోడు సభను ప్రకటించిన బీజేపీ
- అమిత్ షా గానీ, జేపీ నడ్డా గానీ వస్తారంటూ ప్రచారం
- అమిత్ షా షెడ్యూల్ సహకరించక పోవడంతో జేపీ నడ్డా రాక
- అధికారికంగా ప్రకటించిన బీజేపీ తెలంగాణ శాఖ
ఈ నెల 31న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఇదివరకే బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గానీ, లేదంటే జేపీ నడ్డా గానీ హాజరు కానున్నట్లు ఆ పార్టీ నేతలు ఇదివరకే వెల్లడించారు. మునుగోడు ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో అమిత్ షానే ఈ సభకు రప్పించే దిశగా చర్యలు చేపట్టింది. అయితే అమిత్ షా షెడ్యూల్ సహకరించని నేపథ్యంలో జేపీ నడ్డా ఈ సభకు రానున్నారు. జేపీ నడ్డా షెడ్యూల్ ఖరారు కావడంతో మంగళవారం బీజేపీ తెలంగాణ శాఖ అధికారిక ప్రకటన చేసింది.