కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి
- విఘ్నాలు తొలగిపోవాలని కోరుకున్న బాఘెల్
- గోవర్ధన్ పూజలో భాగంగా కొరడా దెబ్బలు
- దీపావళి సందర్భంగా ఆలయంలో పూజలు
- స్థానిక ఆచారాన్ని పాటించిన బాఘెల్
ఛత్తీస్ గఢ్ లో దీపావళి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామంలో గోవర్ధన్ పూజ జరగగా ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ అందులో పాల్గొన్నారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తులలాగే ముఖ్యమంత్రి బాఘెల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. దీనివల్ల శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని ముఖ్యమంత్రి బాఘెల్ కూడా పాటిస్తారు. ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్ధన్ పూజలో పాల్గొంటారు.