యాదాద్రి జిల్లా మల్కాపురంలో జేపీ నడ్డాకు సమాధి కట్టిన వైనం.. తీవ్ర ఆగ్రహంతో టీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చిన కిషన్ రెడ్డి
- బతికున్న వ్యక్తికి సమాధి కట్టి టీఆర్ఎస్ అన్ని హద్దులు దిగజారిందని కిషన్ రెడ్డి ఆగ్రహం
- తన సహనాన్ని అసమర్థతగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
- వినాశకాలే విపరీత బుద్ధి అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్
మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందన్నారు. బతికున్న వ్యక్తికి సమాధి కట్టే నీచ చర్యకు దిగడం ద్వారా హద్దులు దాటి టీఆర్ఎస్ దిగజారిందని మండిపడ్డారు. గతంలో తన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారన్నారు. తమ సహనాన్ని అసమర్థతగా భావిస్తే టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ చర్యపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం అని అన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఆమె ట్వీట్ చేశారు.