పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన విడదల రజని
- పవన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరారన్న రజని
- మతిభ్రమించి ఏదేదో మాట్లాడినట్టున్నారని ఎద్దేవా
- పవన్, చంద్రబాబు ముసుగులు తొలగించి బయటకు వచ్చారని వ్యాఖ్య
ఒకేసారి రెండు నియోజవర్గాల్లో ఓడిపోయినా పవన్ కు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టే ఉంటుందని... ఈ విషయం ఇప్పుడు జనసేన కార్యకర్తలకు కూడా అర్థమయిందని అన్నారు. పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఇంతకాలం ముసుగు వేసుకుని ఉన్నారని... ఇప్పుడు ముసుగులు తొలగించి బయటకు వచ్చారని విమర్శించారు.
రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని రజని అన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలనకు వస్తారని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు.