మధ్యప్రదేశ్ లో ఎంబీబీఎస్ బోధన ఇక హిందీలో... దేశంలో ఇదే ప్రథమం!

MBBS in Hindi as first time in country
దేశంలో హిందీ భాషను మరింత విస్తరించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బోధన హిందీలో నిర్వహించనున్నారు. 

మధ్యప్రదేశ్ లో మొత్తం 13 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు (అక్టోబరు 16) భోపాల్ లో జరిగే ఓ కార్యక్రమంలో హిందీలోకి అనువదించిన ఎంబీబీఎస్ ఫస్టియర్ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఎంబీబీఎస్ విద్యాబోధన ఓ ఆంగ్లేతర భాషలో బోధించనుండడం దేశంలో ఇదే మొదటిసారి. 

కాగా, ఈ అంశంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ, వైద్య, ఇంజినీరింగ్ కోర్సుల విద్యా బోధన హిందీలో సాధ్యం కాదని, విద్యార్థులు నేర్చుకోలేరని భావించే వారు ఇక అభిప్రాయాలను మార్చుకోక తప్పదని అన్నారు. 

హిందీ మాధ్యమంలో చదువుకుని కూడా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడం సాధ్యమేనని నిరూపించడంలో ఇది తొలి అడుగు అని వివరించారు. విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ అభిలాష అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Hindi
MBBS
Madhya Pradesh
Amit Shah
India

More Telugu News