Telangana: కార్య‌క‌ర్త‌ల బీమా కోసం రూ.26.11 కోట్ల ప్రీమియం చెల్లించిన టీఆర్ఎస్‌

trs working presudent kts handed over bima premium to insurance companies
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ త‌న కార్యక‌ర్త‌ల బీమా కోసం గ‌డ‌చిన ఏడేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి బీమా ప్రీమియం మొత్తం రూ.26.11కోట్లను బీమా సంస్థ‌ల‌కు చెల్లించింది. ఈ మేర‌కు బీమా సంస్థ‌ల‌కు చెందిన అధికారుల‌కు మంగ‌ళ‌వారం ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ చెక్కును అంద‌జేశారు.

టీఆర్ఎస్ అందిస్తున్న బీమా ప్ర‌కారం ప్ర‌మాదంలో మృతి చెందే కార్య‌కర్త‌ల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల బీమా సొమ్ము అంద‌నుంది. అదే స‌మ‌యంలో ప్ర‌మాదాల్లో పూర్తి స్థాయి అంగ‌వైక‌ల్యం క‌లిగితే రూ. 1 ల‌క్ష‌, పాక్షిక అంగ‌వైక‌ల్యానికి రూ.50 వేలు అంద‌నున్నాయి. ఇందుకోసం గ‌డ‌చిన ఏడేళ్ల‌లో పార్టీ త‌ర‌ఫున రూ.66 కోట్ల‌ను వెచ్చించిన‌ట్లు కేటీఆర్ తెలిపారు.
Telangana
TRS
KTR

More Telugu News