Team India: ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో టీమిండియా అరుదైన రికార్డు

team india new record with 300 victories in idi format
షార్ట్స్‌లో చూడండి
భార‌త క్రికెట్ జ‌ట్టు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో... ప్ర‌త్యేకించి వ‌న్డే క్రికెట్‌లో మరే ఇతర జ‌ట్టుకు అంద‌నంత ఎత్తులో నిలిచింది. అంత‌ర్జాతీయ వ‌న్డే ఫార్మాట్‌లో 300 విజ‌యాల‌ను సాధించిన జ‌ట్టుగా టీమిండియాకు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఇప్ప‌టికే ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్టుగా గుర్తింపు పొందిన టీమిండియా... ఆదివారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో విజ‌యంతో '300' విక్ట‌రీ మార్కును అందుకుంది.

ఈ ఫార్మాట్‌లో అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్టుగా టీమిండియా కొన‌సాగుతుండ‌గా... 257 విజ‌యాల‌తో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, 247 విజ‌యాల‌తో వెస్టిండీస్ మూడో స్థానంలో కొన‌సాగుతున్నాయి. స‌మీప భ‌విష్య‌త్తులో టీమిండియా రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డం దాదాపుగా ఏ జ‌ట్టుకూ సాధ్యం కాద‌నే చెప్పాలి. అంతేకాకుండా ఈ విష‌యంలో క‌నీసం టీమిండియాకు చేరువ కావడం కూడా ఆయా దేశాల జ‌ట్ల‌కు అసాధ్య‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Team India
Cricket
ODI
Australia
West Indies

More Telugu News