Arvind Kejriwal: కేజ్రీవాల్‌ హిందూ వ్యతిరేకి అంటూ పోస్టర్లు.. వారి అంతానికి శ్రీకృష్ణుడే తనను పంపారన్న ఢిల్లీ సీఎం

Lord Sri Krishna sent me to end Kamsa legecy says Arvind kejriwal
  • కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ‘గో బ్యాక్’ పోస్టర్లు
  • తాను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పుట్టానన్న కేజ్రీవాల్
  • కంసుడి వారసులను అంతం చేసే పనిని శ్రీకృష్ణుడు తనకు అప్పగించాడన్న ‘ఆప్’ చీఫ్
తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ గుజరాత్‌లోని పలు నగరాల్లో వెలసిన ‘గో బ్యాక్’ పోస్టర్లపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. గుజరాత్‌లో నిన్న పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. పోస్టర్లు, బ్యానర్లతో దేవుడ్ని అవమానించిన వారిని గుజరాత్ ప్రజలు  ఊరికే వదిలిపెట్టబోరని అన్నారు. 

తాను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పుట్టానని, గుజరాత్‌లో గూండాగిరీ అంతమయ్యేలా కంసుడి వారసులను తుదముట్టించే ప్రత్యేక పనిని ఆ శ్రీకృష్ణుడే తనకు అప్పగించాడని అన్నారు. దేవుడి కోరికను తీర్చేందుకు కలిసి పనిచేస్తామని అన్నారు. గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో మాదిరిగా భక్తుల అయోధ్య పర్యటన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 

కాగా, గుజరాత్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ధ్యేయంగా పావులు కదుపుతున్న కేజ్రీవాల్ రాష్ట్రంలో వరుసగా పర్యటిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. సామాన్యులను దగ్గర చేనుకునేందుకు దళితుల ఇంట్లో భోజనాలు చేస్తూ, వారిని తన ఇంటికి విందుకు ఆహ్వానిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Arvind Kejriwal
Gujarat
AAP
Lord Sri Krishna

More Telugu News