Congress: వైర‌ల్ ఫొటో!.. త‌ల్లి పాదాల‌కు బూట్లు తొడిగిన రాహుల్ గాంధీ!

  • మాండ్యా జిల్లాలోని పాండపురలో పునఃప్రారంభమైన రాహుల్‌ యాత్ర‌
  • కుమారుడితో క‌లిసి యాత్ర‌లో పాల్గొన్న సోనియా గాంధీ
  • త‌ల్లి పాదాల‌కు రాహుల్‌ బూట్లు తొడిగి లేస్ క‌డుతుండ‌గా క్లిక్‌మ‌న్న కెమెరా
  • కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు నెటిజ‌న్లు కూడా షేర్ చేస్తున్న వైనం
Rahul Gandhi wears shoes on his mother sonia gandhi feet

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర 2 రోజుల స్వ‌ల్ప విరామం త‌ర్వాత గుర‌వారం ఉద‌యం తిరిగి ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. గురువారం ఉద‌యం 6.30 గంట‌ల‌కు క‌ర్ణాట‌క‌లోని మాండ్యా జిల్లాలోని పాండపురలో యాత్ర పునఃప్రారంభ‌మైంది. యాత్ర‌లో సాగుతున్న‌ కుమారుడిని చూసేందుకు క‌ర్ణాట‌క వ‌చ్చిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ యాత్ర‌లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌ల్లి పాదాల‌కు రాహుల్ గాంధీ బూట్లు తొడిగారు. త‌ల్లి పాదాల‌కు బూట్లు తొడిగిన అనంతరం షూ లేస్ క‌డుతున్న స‌మ‌యంలో తీసిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫొటోను ఇటు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో పాటు అటు నెటిజ‌న్లు కూడా షేర్‌ చేస్తున్నారు. వెర‌సి ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

More Telugu News