15 కేటగిరీల్లో ఆస్కార్ కు 'ఆర్ఆర్ఆర్' నామినేషన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

15 కేటగిరీల్లో ఆస్కార్ కు 'ఆర్ఆర్ఆర్' నామినేషన్లు!

RRR team sending 15 nominations to Oscars
  • 'చెల్లో షో'ని నామినేట్ చేసిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
  • దీంతో సొంతంగా నామినేషన్లు పంపేందుకు యత్నిస్తున్న 'ఆర్ఆర్ఆర్' యూనిట్
  • బెస్ట్ హీరో కేటగిరీలో తారక్, రామ్ చరణ్
ఆస్కార్ అవార్డులకు సంబంధించిన 15 కేటగిరీలకు నామినేషన్స్ పంపేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. 'ఆర్ఆర్ఆర్'ని కాదని గుజారాతీ సినిమా 'చెల్లో షో'ని అస్కార్ కు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక ఎంట్రీగా ప్రకటించింది. దీంతో, దేశంలోని అనేక మంది సినీ ప్రియులు తీవ్ర నిరాశ చెందారు. దీంతో, ఈ సినిమాను నేరుగా ఆస్కార్ కు పంపించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలను ప్రారంభించింది. 

15 కేటగిరీలు ఇవే:
  • బెస్ట్ మోషన్ పిక్చర్
  • బెస్ట్ డైరెక్టర్ - రాజమౌళి
  • బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
  • బెస్ట్ యాక్టర్ :  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగణ్ 
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: అలియా భట్
  • బెస్ట్ సినిమాటోగ్రఫీ : కేకే సెంథిల్ కుమార్
  • బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్
  • బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : ఎంఎం కీరవాణి
  • బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ : రమా రాజమౌళి
  • బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
  • బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్ : నల్ల శ్రీను, సేనాపతి నాయుడు
  • బెస్ట్ సౌండ్ : (రఘునాథ్ కామిశెట్టి, బోలోయ్ కుమార్ డోలోయి, రాహుల్ కార్పే) 
  • బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : వి. శ్రీనివాస్ మోహన్.
RRR
Oscars
Nominations

More Telugu News