కూలిన చీతా హెలికాప్టర్.. ఆర్మీ పైలట్ మృతి
- బుధవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ లో దుర్ఘటన
- రోజువారీ విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతుండగా ప్రమాదం
- తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్లు.. చికిత్స పొందుతూ మరొకరు మృతి
గస్తీ కోసం వినియోగించే చీతా
చీతా రకం హెలికాప్టర్లను భారత ఆర్మీ గస్తీ కోసం వినియోగిస్తుంటుంది. అదే క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ లో రోజువారీ గస్తీ కోసం బుధవారం ఉదయం ఇద్దరు పైలట్లతో చీతా హెలికాప్టర్ బయలుదేరింది. తవాంగ్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఉదయం 10 గంటల సమయంలో ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆర్మీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పైలట్లను ఆస్పత్రికి తరలించాయి. వారిలో ఒకరు చికిత్స పొందుతూ కన్నుమూయగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్న దానిపై పరిశీలన జరుపుతున్నట్టు ఆర్మీ వెల్లడించింది.