ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ దసరా సేల్’ రేపటి నుంచే
- ఈ నెల 8 వరకు ప్రత్యేక విక్రయాలు
- యాపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్
- హెచ్ డీఎఫ్ సీ కార్డులపై 10 శాతం అదనపు తగ్గింపు
ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు బిగ్ దసరా సేల్ విక్రయాలు మంగళవారం ప్రారంభం కాగా, మిగిలిన అందరికీ ఈ నెల 5 నుంచి బిగ్ దసరా సేల్ మొదలు కానుంది. ఈ నెల 8వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తోంది.
ఐఫోన్ 13, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 మినీ తదితర ఫోన్లను కనిష్ట ధరల్లో ఆఫర్ చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డులపై ఆఫర్ ను కూడా కలిపి చూస్తే.. ఐఫోన్ 13 రూ. 57 వేలకు, ఐఫోన్ 13 మినీ రూ. 35,990కు, ఐఫోన్ 11 రూ. 34,490కు లభిస్తోంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రోపైనా డిస్కౌంట్ ఉంది.