గుర్తింపు లేని చోట నేను పని చేయను: సినీ రచయిత కోన వెంకట్
- రైటర్ గా కోన వెంకట్ ఫుల్ బిజీ
- ఎవరి క్రెడిట్ వారికి ఇవ్వవలసిందేనంటూ వ్యాఖ్య
- గోపీ మోహన్ తో గొడవ లేదంటూ వివరణ
- తన స్పీడ్ కారణంగానే ఇన్ని సినిమాలు చేశానంటూ వెల్లడి
ఒక యూ ట్యూబ్ ఛానల్లో ఇందుకు గల కారణం గురించి చెప్పమనే ప్రశ్న కోన వెంకట్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నేను ఇండస్ట్రీకి వచ్చిందే గుర్తింపు కోసం .. నా క్రెడిట్ ను మరొకరు తీసుకుంటానంటే ఊరుకోను. అవతల వ్యక్తి ఉద్దేశం ఏదైనా నాకు రావలసిన క్రెడిట్ రాకపోతే బాధపడతాను .. అలాంటి చోట పని చేయడం మానేస్తాను. టీమ్ వర్క్ వల్లనే సక్సెస్ సాధ్యపడుతుందని నేను నమ్ముతాను. అందరినీ గుర్తించవలసిందే.
ఇక గోపీమోహాన్ విషయానికి వస్తే .. తాను చాలా నిదానం. అలా తాపీగా రాయడం ఆయనకి అలవాటు .. నేనేమో కొంచెం స్పీడ్ ఎక్కువ.. అందువలన మా ఇద్దరికీ సెట్ కాలేదు. అంతే తప్ప ఎలాంటి మనస్పర్థలు లేవు. శ్రీను వైట్లకి గోపీ మోహన్ దగ్గర కావడం వలన ఆయనను నేను దూరం పెట్టాను అనే ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు" అని చెప్పుకొచ్చారు.