తొలి టీ20: టీమిండియాపై టాస్ గెలిచిన ఆసీస్... స్వల్ప స్కోర్లకే అవుటైన రోహిత్, కోహ్లీ

Team India fases Australia in 1st T20
  • మొహాలీలో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • టీమిండియాకు మొదట బ్యాటింగ్
మొహాలీలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లీ 2 పరుగులు చేసి అవుటయ్యారు. ఇటీవల ఆసియా కప్ లో అద్భుతంగా ఆడి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ, ఈ మ్యాచ్ లో సింగిల్ డిజిట్ స్కోరుకు వెనుదిరిగాడు. 

రోహిత్ ను హేజెల్ వుడ్ అవుట్ చేయగా, కోహ్లీ వికెట్ నాథన్ ఎల్లిస్ ఖాతాలోకి చేరింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 5 ఓవర్లలో 2 వికెట్లకు 35 పరుగులు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 21, సూర్యకుమార్ యాదవ్ పరుగులేమీ లేకుండా క్రీజులో ఉన్నారు.
Go Back to Shorts
Team India
Australia
1st T20
Mohali

More Telugu News