కోహ్లీ, పాండ్యా ‘షకబూమ్’ డ్యాన్స్ చూశారా.. వీడియో ఇదిగో!
- టిక్ టాక్ వైరల్ వీడియోకు స్టెప్పులు వేసిన క్రికెటర్లు
- ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హార్దిక్
- ఇద్దరి సరదా స్టెప్పులు చూసి నవ్వుకుంటున్న ఫ్యాన్స్
ప్రస్తుతం ఈ ఇద్దరూ మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 కోసం మొహాలీలో ఉన్నారు. ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ ముమ్మరంగా సాధన చేశాడు. ఆసియా కప్ లో అద్భుతంగా ఆడిన కోహ్లీ అదే ఫామ్ కొనసాగించాలని చూస్తున్నాడు. మరోవైపు ఆసియా కప్ లో తొలి మ్యాచ్ లో మినహా అంతగా ఆకట్టుకోలేకపోయిన పాండ్యా ఆస్ట్రేలియాతో సిరీస్ లో సత్తా చాటాలని ఆశిస్తున్నాడు.