పయ్యావుల కుమారుడు కూడా అమరావతిలో భూములు కొన్నారు: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- తొలి రోజే అధికార వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీలో చర్చ
- చర్చలో పాలుపంచుకున్న ఆర్థిక మంత్రి బుగ్గన
- రాజధాని అమరావతిలోనే వస్తుందని టీడీపీ నేతలకే ఎలా తెలిసిందని ప్రశ్న
- హెరిటేజ్ కూడా అమరావతిలో 14 ఎకరాలు కొన్నదని వెల్లడి
- అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణ
ఏపీ రాజధాని అమరావతిలోనే వస్తుందని టీడీపీ నేతలకు మాత్రమే ఎలా తెలిసిందని కూడా బుగ్గన ప్రశ్నించారు. అందరికంటే ముందు ఏపీ రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న టీడీపీకి చెందిన చాలా మంది నేతలు అమరావతిలో భూములు కొన్నారని ఆయన అన్నారు. అలా అమరావతిలో భూములు కొన్నవారిలో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కుమారుడు విక్రమ్ సింహ కూడా ఉన్నారన్నారు. చంద్రబాబు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ సంస్థ కూడా అమరావతిలో 14 ఎకరాలు కొనుగోలు చేసిందని బుగ్గన ఆరోపించారు.