గోవా కాంగ్రెస్ లో భారీ సంక్షోభం... బీజేపీలో చేరుతున్న 8 మంది ఎమ్మెల్యేలు!

Eight Goa Congress MLAs set to join BJP
ఓవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో పేరిట పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పాదయాత్ర చేస్తుండగా, మరోవైపు గోవాలో ఆ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గోవా బీజేపీ అధినాయకత్వం వెల్లడించడంతో రాజకీయ కలకలం బయల్దేరింది. 

ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఇవాళ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని గోవా బీజేపీ తెలిపింది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను కలిసినట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్న నేపథ్యంలో గోవా అసెంబ్లీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. 

గోవాలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పుడు సగం మందికి పైగా బీజేపీలోకి వెళుతుండడంతో కాంగ్రెస్ నామమాత్రంగా మారనుంది.
Go Back to Shorts
MLAs
Congress
BJP
Goa

More Telugu News