Kiran Abbavaram: 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!

  • కిరణ్ హీరోగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'
  • రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ
  • కథానాయికగా సంజన ఆనంద్ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా మణిరత్నం 
  • ఈ నెల 16వ తేదీన సినిమా రిలీజ్
Nenu Meeku Baga Kavalsinavadini movie update

కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా రూపొందింది. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా శ్రీధర్ గాదె పరిచయమవుతున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టయినర్ తో సంజన ఆనంద్ కథానాయికగా పరిచయమవుతోంది. ఐటమ్ సాంగులో సోను ఠాకూర్ మెరవనుంది. 


ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ ఈ వేడుకకి వేదిక కానుంది. ఎల్లుండి సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. 

మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతూ వస్తున్నారు. ఇంతవరకూ వదిలిన పాటలు కూడా మంచి మార్కులను సంపాదించుకున్నాయి. వరుసగా రెండు ఫ్లాపులు పడటం వలన, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కిరణ్ అబ్బవరం ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News