Vodafone Idea: వొడాఫోన్ ఐడియా ఫ్యాన్సీ నంబర్.. ఆన్ లైన్ లో ఇలా తీసుకోవచ్చు..! 

How to get a FREE fancy number from Vodafone Idea Follow these steps
  • ఉచితంగానే ఫ్యాన్సీ నంబర్లను ఆఫర్ చేస్తున్న వొడాఫోన్ ఐడియా
  • వీఐపీ నంబర్ కావాలంటే రూ.500 చెల్లించుకోవాలి
  • కంపెనీ అధికారిక పోర్టల్ నుంచి తీసుకోవచ్చు
ఫోన్ నంబర్ ఫ్యాన్సీగా ఉండాలని కోరుకోని వారు అరుదు. మంచి ఆకర్షణీయమైన నంబర్ కనిపిస్తే ఎగిరి గంతేసి తీసుకుంటారు. ఇలాంటి వారి కోసమే వొడాఫోన్ ఐడియా ఫ్యాన్సీ నంబర్లను ఆఫర్ చేస్తోంది. ఫోన్ నంబర్ ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వారు వొడాఫోన్ ఐడియా కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

వొడాఫోన్ ఐడియా ఫ్యాన్సీ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నంబర్లను కస్టమర్లకు అందిస్తోంది. అది కూడా ఉచితంగానే. ఆన్ లైన్ లోనే వీటిని తీసుకునే అవకాశం ఉండడం మరో అనుకూలతగా చెప్పుకోవాలి. ఫ్యాన్సీ నంబర్ కోరుకునే వారు వొడాఫోన్ ఐడియా అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ న్యూ కనెక్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫ్యాన్సీ నంబర్స్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. 

దాంతో కొత్త వెబ్ పేజీ తెరుచుకుంటుంది. ప్రీ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ ఏదన్నది అడుగుతుంది. అందులో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత యూజర్ తాను నివాసం ఉంటున్న పిన్ కోడ్ ఇవ్వాలి. అనంతరం ఉచిత ఫ్యాన్సీ నంబర్ల జాబితా కనిపిస్తుంది. అక్కడే వీఐపీ ఫ్యాన్సీ నంబర్ల జాబితా కూడా ఉంటుంది. వీఐపీ నంబర్ కావాలంటే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
Vodafone Idea
fancy number
free
online
VIP number

More Telugu News