భర్త సినిమా షూటింగ్ లో సందడి చేసిన గుత్తా జ్వాల
- గుత్తా జ్వాల భర్త విష్ణు విశాల్ తాజా చిత్రం 'ఆర్యన్'
- పూజా కార్యక్రమానికి హాజరైన గుత్తా జ్వాల
- సినిమా ఉత్కంఠభరితంగా ఉంటుందన్న దర్శకుడు ప్రవీణ్
ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి గుత్తా జ్వాల హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మరోవైపు చిత్ర దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ... ఈ సినిమాలో విష్ణు విశాల్ పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్రను పోషిస్తున్నాడని చెప్పారు. ఊహించని మలుపులతో ఈ సినిమా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని చెప్పారు.