ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వీడియో కోసం వేగంగా వెళుతున్న రైలు పక్కన నడిచే యత్నం... ఎలా పడిపోయాడో చూడండి!
- ఖాజీపేట్ వద్ద ఘటన
- వేగంగా వస్తున్న రైలు
- ఒక్కసారిగా పడిపోయిన యువకుడు
- తప్పిన ముప్పు
- వీడియో వైరల్
వేగంగా రైలు వస్తుండగా, దానిపక్కనే తాను నడుస్తున్నట్టు చిత్రీకరించాలని భావించాడు. అనుకున్నట్టుగానే... ఖాజీపేట్ వద్ద ఓ రైలు వేగంగా వస్తుండగా, దానికి అత్యంత దగ్గరగా నడిచే ప్రయత్నం చేశాడు. కానీ ఆ రైలు వేగానికి యువకుడు ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. అయితే అతడికి ప్రాణాపాయం కలగకపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.