హాంకాంగ్‌పై అతిపెద్ద విజయం సాధించిన పాకిస్థాన్.. రేపు భారత్‌తో ఢీ!
- పాక్ బౌలర్ల దెబ్బకు చిగురుటాకులా వణికిన హాంకాంగ్
- 10.4 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌట్
- 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన పాక్
- సూపర్-4లోకి ప్రవేశించిన పాకిస్థాన్
నిజానికి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. చివరి వరకు పోరాడింది. ఒక దశలో విజయం దోబూచులాడింది. దీంతో పాకిస్థాన్-హాంకాంగ్ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. అయితే, హాంకాంగ్‌ను ఏ దశలోనూ కుదురుకోనివ్వని పాకిస్థాన్ ఘన విజయం సాధించి సూపర్-4కు దూసుకెళ్లింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ 57 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 78 పరుగులు చేశాడు. ఫకర్ జమాన్ 53, ఖుష్‌దిల్ 35 (నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజం 9 పరుగులు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన రిజ్వాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టీ20ల్లో పాకిస్థాన్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. కాగా, ఈ విజయంతో సూపర్-4లోకి ప్రవేశించిన పాకిస్థాన్ రేపు మరోమారు భారత్‌ను ఢీకొంటుంది.