గాయంతో ఆసియా కప్ కు దూరమైన రవీంద్ర జడేజా
- కుడి మోకాలి గాయంతో బాధపడుతున్న జడేజా
- మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడి
- జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఎంపిక
- పాక్ పై విజయంలో కీలకభూమిక పోషించిన జడేజా
ఆసియా కప్ టోర్నీలో టీమిండియా స్టాండ్ బై ఆటగాళ్లలో అక్షర్ పటేల్ కూడా ఒకడు. జడేజా తరహాలోనే అక్షర్ పటేల్ కూడా అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించగలడు.
ఆసియా కప్ లో రెండు వరుస విజయాలతో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశ చేరుకుంది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను సెప్టెంబరు 4న ఆడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ తో తలపడే ప్రత్యర్థి ఇంకా ఖరారు కాలేదు.