టాలీవుడ్ చిత్ర నిర్మాణాలకు కొత్త మార్గదర్శకాలు... వివరాలు ఇవిగో!
- టాలీవుడ్ లో మళ్లీ మొదలైన షూటింగులు
- ఆగస్టు 25 నుంచి చిత్రీకరణలు
- ప్రకటన విడుదల చేసిన తెలుగు ఫిలిం చాంబర్
సినిమా నిర్మాణం...
- ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు రోజువారీ చెల్లింపులు ఉండవు.
- ఓ చిత్రం, అందులోని పాత్రల స్థాయి ఆధారంగా నటీనటుల పారితోషికాలను నిర్మాతలు నిర్ణయిస్తారు. ఆ పారితోషికంలోనే నటీనటుల పర్సనల్ స్టాఫ్, లోకల్ ట్రాన్స్ పోర్టు, స్థానికంగా బస, స్పెషల్ ఫుడ్ ఖర్చులు అన్నీ ఇమిడి ఉంటాయి.
- ఓ ఆర్టిస్టుతో కుదుర్చుకున్న పారితోషికం ఒప్పందానికి మించి నిర్మాత ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరంలేదు.
- ఓ సినిమాకు పనిచేసే ప్రధాన టెక్నీషియన్ల పారితోషికాల్లోనే వారి పర్సనల్ స్టాఫ్ ఖర్చులు, స్థానిక బస, లోకల్ ట్రాన్స్ పోర్టు, స్పెషల్ ఫుడ్ ఖర్చులు ఇమిడి ఉంటాయి. ముందు ఒప్పందం కుదుర్చుకున్న మేరకు తప్ప నిర్మాత అదనంగా చెల్లించాల్సినదేమీ ఉండదు.
- ప్రతి అగ్రిమెంట్ లోనూ పారితోషికం వివరాలు కచ్చితంగా ఉండాలి. ఆ వివరాలను చాంబర్ నిర్ధారించాల్సి ఉంటుంది
ఓటీటీ...
- ఓ సినిమా టైటిల్స్ లో, థియేట్రికల్ రిలీజ్ ప్రచారంలో ఓటీటీ, శాటిలైట్ భాగస్వాముల పేర్లు ఉండవు.
- ఒక సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాల్సి ఉంటుంది.
థియేటర్లు/ఎగ్జిబిటర్ల అంశాలు..
- వీపీఎఫ్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 3న జరగాల్సిన తదుపరి సమావేశం 6వ తేదీకి వాయిదా పడింది.
- తెలంగాణలో ఇచ్చినంత పర్సెంటేజీనే ఆంధ్రాలోని మల్టీప్లెక్సులకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
చర్చలు తుది అంకంలోకి ప్రవేశించాయి. ఆమోదించబడిన, ఖరారు చేయబడిన రేట్ కార్డులు అన్ని చిత్ర నిర్మాణ సంస్థల కార్యాలయాలకు అందజేస్తారు.
