Office Boy: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

Office boy commits suicide in Telangana minister Prashant Reddy camp office
  • నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో మంత్రి క్యాంపు కార్యాలయం
  • ఓ గదిలో ఉరేసుకున్న దేవేందర్
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
  • ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న పోలీసులు!
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఆత్మహత్య కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో దేవేందర్ (19) అనే ఆఫీస్ బాయ్ ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. మంత్రి క్యాంపు కార్యాలయంలోని ఓ గదిలో దేవేందర్ ఉరివేసుకుని ఉన్న స్థితిలో గుర్తించారు. స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు విడిచాడు. 

దీనిపై ఆర్మూర్ పోలీసులు వివరాలు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవాడని వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు ఆమెకు సందేశం పంపాడని తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతామని ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు.
Office Boy
Suicide
Vemula Prashanth Reddy
Camp Office

More Telugu News