Telangana: తెలంగాణ ఐసెట్ ఫ‌లితాల్లో ఏపీ విద్యార్థులే టాపర్లు

ap students tops in ts icet results
షార్ట్స్‌లో చూడండి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం తెలంగాణ స‌ర్కారు నిర్వ‌హించిన టీఎస్ ఐసెట్ ఫ‌లితాలు శ‌నివారం విడుద‌ల‌య్యాయి. వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ర‌మేశ్ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లో మొత్తంగా 61,613 మంది విద్యార్థులు అర్హ‌త సాధించారు. రాష్ట్రంలోని 272 క‌ళాశాలల్లో అందుబాటులో ఉన్న 27,017 సీట్ల భ‌ర్తీ కోసం ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.

ఇటీవ‌లి కాలంలో తెలంగాణ‌లో నిర్వ‌హిస్తున్న ప‌లు పోటీ ప‌రీక్ష‌ల్లో ఏపీ విద్యార్థులు టాప‌ర్లుగా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో టీఎస్ ఐసెట్ ఫ‌లితాల్లోనూ టాప్ 3 ర్యాంకుల‌ను ఏపీ విద్యార్థులే చేజిక్కించుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్ వ‌ర్థ‌న్ తొలి ర్యాంకును ద‌క్కించుకున్నాడు. క‌డ‌ప జిల్లా అంబ‌వ‌రం ఉమేశ్ చంద్రారెడ్డి రెండో ర్యాంకు సాధించాడు.
Go Back to Shorts
Telangana
Andhra Pradesh
ICET
KU

More Telugu News