రజనీ మూవీలో రమ్యకృష్ణ రోల్ హైలైట్ అట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీ మూవీలో రమ్యకృష్ణ రోల్ హైలైట్ అట!

Jailer Movie Update
  • 'జైలర్' గా రజనీకాంత్ 
  • కథానాయికగా రమ్యకృష్ణ 
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు  
రజనీకాంత్ హీరోగా 'జైలర్' రూపొందుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో రజనీ సరసన నాయిక పాత్ర కోసం ముందుగా ఐశ్వర్యరాయ్ ను సంప్రదించారట. 'రోబో' తరువాత ఈ కాంబినేషన్ ను రిపీట్ చేద్దామనుకున్నారు.  

అయితే కొన్ని కారణాల వలన ఆమె సెట్ కాకపోవడంతో రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. అధికారికంగా ప్రకటించారు కూడా. గతంలో రజనీ .. రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చిన 'నరసింహా' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. అందువలన సహజంగానే అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండటంతోనే రమ్యకృష్ణ ఓకే చెప్పారని అంటున్నారు. 

త్వరలోనే ఈ సినిమా షూటింగులో రమ్యకృష్ణ జాయిన్ కానున్నారు. ఈ జోడీని మళ్లీ తెరపై చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. యోగిబాబు .. వినాయకన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు.
Rajanikanth
Ramyakrishna
Jailer Movie

More Telugu News