రేపు జేపీ న‌డ్డాతో హీరో నితిన్ భేటీ

jp  nadda willmeet hero nithin tomorrow
  • ఇటీవ‌లే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ
  • రేపు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్న జేపీ న‌డ్డా
  • వ‌రంగ‌ల్ బీజేపీ స‌భ‌కు హాజ‌రు కానున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు
  • ఈ ప‌ర్య‌ట‌న‌లోనే నితిన్‌తో భేటీ కానున్న న‌డ్డా
తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న బీజేపీ అధినాయ‌క‌త్వం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుల‌తో వ‌రుస‌గా భేటీలు అవుతోంది. గ‌త‌వారం మునుగోడులో నిర్వ‌హించిన బీజేపీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన బీజేపీ కీల‌క నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపుగా అర‌గంట‌కు పైగా సాగిన ఈ భేటీలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా ఏఏ అంశాల‌పై చ‌ర్చించార‌నే విష‌యం బ‌య‌ట‌కు రాకున్నా... ఈ భేటీపై ఇటు తెలంగాణ‌తో పాటు అటు ఏపీలోనూ పెద్ద చ‌ర్చే సాగుతోంది.

తాజాగా శ‌నివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో టాలీవుడ్‌కు చెందిన మ‌రో హీరో నితిన్ భేటీ కానున్నట్టు సమాచారం. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట చేప‌ట్టిన మూడో ద‌శ యాత్ర రేపు వ‌రంగ‌ల్‌లో ముగియ‌నుంది. ఈ సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసింది. ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకే జేపీ న‌డ్డా తెలంగాణ వ‌స్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న హీరో నితిన్‌తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
BJP
Telangana
Bandi Sanjay
JP Nadda
Warangal
Tollywood
Nithin
Amit Shah
Jr NTR

More Telugu News