Nitya Menon: నాకు బాగా పొగరు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు: నిత్యా మీనన్

Nitya Menon opines on negative comments
షార్ట్స్‌లో చూడండి
ప్రతిభావంతులైన దక్షిణాది హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. అందాల ప్రదర్శన కంటే అభినయానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తక్కువ సమయంలోనే పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. నిత్యా మీనన్ తాజాగా ఓ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు బాగా పొగరు అని ఇండస్ట్రీలో ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని స్పష్టం చేసింది. తాను ఎదుగుతుంటే ఓర్వలేని కొందరు ఆ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని వివరించింది. 

ఇండస్ట్రీలో తనకు చాలామంది శత్రువులు ఉన్నారని వెల్లడించింది. వారే తనను కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంటారని పేర్కొంది. వారికి లోబడి తాను నడుచుకోకపోవడంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపారని మండిపడింది. ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించానని, ఏ ఒక్కరూ నిత్యాతో పనిచేయడం కష్టమని అనలేదని తెలిపింది.
Go Back to Shorts
Nitya Menon
Negative Comments
Enemies
Cine Industry
Tollywood
Kollywood

More Telugu News